మియాపూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఈగల్ ఫోర్స్ దాడులు

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : నగరంలో విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. అంతర్రాష్ట్ర ఎండీఎంఏ సరఫరా నెట్‌వర్క్‌పై దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 14 ఎండీఎంఏ మాత్రలు, 9 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎండీఎంఏ విలువ సుమారు రూ.22,500 ఉంటుందని అంచనా. గోవా-ముంబై-హైదరాబాద్ లింక్ పోలీసుల కథనం ప్రకారం.. సూర్య గౌడ్ (29)...