ఎస్సీ, ఎస్టీల పౌరహక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
🔸వివక్ష, వేధింపులపై అధికారులు తక్షణమే స్పందించాలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎస్సీ, ఎస్టీల పౌరహక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా తూముకుంటలో శనివారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి వివక్ష, సామాజిక అణచివేత, దాడులు, వేధింపులు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని...