ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం..! డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. విద్యార్థి మృతి

ఆర్ జె న్యూస్ ,మేడ్చల్ : బాచుపల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అవునూరి సూర్య తన స్నేహితురాలు గోధేసి వర్షతో కలిసి నవంబరు 7న రాత్రి 10.30 గంటల సమయంలో యాక్టివాపై ప్రగతినగర్‌ నుంచి మియాపూర్‌ వైపు వెళ్తున్నాడు. బాచుపల్లి ఫ్లైఓవర్‌ మధ్యలో మలుపు వద్ద స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సూర్య తలకు, ముఖానికి...