ఎల్లారెడ్డిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మట్టి దిబ్బను తప్పించబోయి స్కూటీ స్కిడ్.. టిప్పర్ వెనుక చక్రాల కింద పడి దుర్మరణం ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లారెడ్డిగూడలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతి, బాలుడు టిప్పర్ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ రాయల్ ఇరానీ కేఫ్ సమీపంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. కాప్రాకు చెందిన మార్తల సూర్య నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి తన అపార్ట్‌మెంట్‌లో...