బొమ్మరాసిపేట రైతుల భూములపై పోరాటం..! శామీర్‌పేట రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసనకు ఈటల రాజేందర్‌ హాజరు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట రైతుల భూ సమస్య పరిష్కారం కోసం శామీర్‌పేట రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ హాజరై రైతులకు మద్దతు తెలిపారు. 1969లో రైతులు కొనుగోలు చేసిన భూములను బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు కలిసి రైతుల కళ్లల్లో మట్టి కొట్టారని ఆయన ఆరోపించారు.నిషేధ జాబితాలో చేర్చిన భూములకు కనీసం 40 శాతం డబ్బులు ఇవ్వాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలని డిమాండ్‌ చేయాల్సిన దుస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు. భూములను 22(ఏ) నిషేధ...