దోమల నివారణకు ఐదు సూత్రాలు

ప్రత్యేక కార్యాచరణకు ఎంఎంసీ శ్రీకారం.. కాప్రా స్కూల్లో విద్యార్థులకు అవగాహన ఆర్ జె న్యూస్, కాప్రా : వానాకాలం ముగిసినా దోమల బెడద తగ్గడం లేదు. ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉండే నీరు, పనికి రాని వస్తువులు దోమల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు మల్కాజిగిరి నగర పాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. దోమల నివారణకు 'చెక్-5' పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చని సూచిస్తోంది. ఎంఎంసీ...