మేడ్చల్‌లో ఫుడ్ కమిషన్ కొరడా
🔸రేషన్ షాపులు, సంక్షేమ వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు 🔸అక్రమాలకు తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రజలకు అందాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా.. సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ కమిషన్ కొరడా ఝళిపించింది. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం మేడ్చల్ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రేషన్ దుకాణాలు, సంక్షేమ విద్యాసంస్థల్లో రికార్డులు, సరుకుల నిల్వలు, ఆహార నాణ్యతను నిశితంగా పరిశీలించింది. రేషన్ పంపిణీపై ఆరా పట్టణంలోని...