చినుకు కోసం.. చిగురుటాకులా రైతన్న ఆశ

🔸కళ్లముందే ఎండుతున్న పంటలు.. ట్యాంకర్ల నీటితో బతికించే ప్రయత్నం 🔸ఎల్లంపేట్ మున్సిపల్ రావల్ కోల్ గ్రామంలో అన్నదాత ఆవేదన ఆర్ జె న్యూస్,మేడ్చల్‌ : ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు.. చినుకు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు.. కళ్లముందే పచ్చగా కళకళలాడాల్సిన పంట వాడిపోతుంటే కన్నీటిని దిగమింగుతున్నాడు. మేడ్చల్ మండలంలో రావలకోల్ గ్రామంలో అన్నదాతల పరిస్థితి ఇది. రైతు చెమట చిందించి పంట సాగు చేశాడు. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి...