RJNEWS TELUGU
Date of Publish : 19 September 2026, 8:54 pm Posted by : RJ NEWS TELUGU

చిర్యాలలో శ్రీ నారాయణి మహాదేవి హోమంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం చిర్యాల గ్రామ పరిధిలో నిర్వహించిన శ్రీ నారాయణి మహాదేవి హోమం కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.