RJNEWS TELUGU
Date of Publish : 06 October 2026, 9:32 pm Posted by : RJ NEWS TELUGU

చెరుకొమ్ము పద్మా గౌడ్‌ భర్తకు మాజీ మంత్రి మల్లారెడ్డి నివాళి

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా నాయకురాలు చెరుకొమ్ము పద్మా గౌడ్‌ భర్త కుమార్ గౌడ్ మంగళవారం తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మేడ్చల్‌ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, విష్ణు చారి, శేఖర్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు