సెప్టెంబర్ 1 నుంచి ఆగనున్న ఉచిత పార్థివ వాహన సేవలు?
ఆర్ జె.న్యూస్,మేడ్చల్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతిచెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల వారి మృతదేహాలను ఉచితంగా స్వగ్రామాలు, ఇళ్లకు తరలించే పార్థివ వాహన సేవలు సెప్టెంబర్ 1 నుంచి నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ఈ సేవలు నిలిచిపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతదేహాలను ఇంటికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌ల నిర్వాహకులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్న నేపథ్యంలో, పేదలకు అండగా ఉండేందుకు 2016 నవంబర్‌లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 50 పార్థివ వాహనాలను...