RJNEWS TELUGU
Date of Publish : 13 September 2026, 7:45 pm Posted by : RJ NEWS TELUGU

రైలాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్, డివిజన్‌ 297 రైలాపూర్‌ గ్రామంలో ‘స్ట్రీట్ కాజ్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ అధినేత, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజాసేవలో తమ ఫౌండేషన్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్తులో ఆరోగ్య, విద్యా కార్యక్రమాలకు సహకరిస్తామని తెలిపారు.శిబిరంలో వైద్యులు జనరల్‌ హెల్త్‌ చెకప్‌తో పాటు బీపీ, షుగర్‌ తదితర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలనువినియోగించుకున్నారు. కార్యక్రమంలో స్ట్రీట్‌ కాజ్‌ ప్రతినిధులు, ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు వెంకటరమణారెడ్డి, బండి శ్రీనివాస్‌ గౌడ్‌, వినయ్‌ వెల్లూరి, ప్రమోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.