RJNEWS TELUGU
Date of Publish : 23 August 2026, 3:49 pm Posted by : RJ NEWS TELUGU

ఘనంగా గడి మైసమ్మ బోనాలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణం లో కొలువైన గడి మైసమ్మ తల్లి బోనాలు ఆదివారం అంగ రంగ వైభవంగా జరిగాయి . ప్రతి యేటా శ్రావణ మాసం లో గడి మైసమ్మ జాతర నిర్వహించడం ఆనాయితీ గా వస్తుంది. ఈ సందర్బంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చారు. అమ్మ వారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఒడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం మహిళలు ఊరేగింపు గా బోనాల ను తీస్కు వచ్చి అమ్మ వారికీ సమర్పించారు. పలు వీధుల నుంచి యువకులు ఫలహర బండ్ల ఊరేగింపును డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళా ల తో ఉత్సాహం తో నిర్వహించారు. జాతరను పురస్కరించుకొని సిఐ అంజిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.