🔸మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు – కాంగ్రెస్ శ్రేణుల హాజరు
ఆర్ జె న్యూస్, జవహర్ నగర్ : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 157వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జవహర్ నగర్ 3వ డివిజన్ అధ్యక్షులు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ అందించిన సేవలు, ఆయన ఆశయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, మనోధర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, మాట్లా శ్రీనివాస్, సత్యం, వంశరాజ్, ఎరగుండ్ల వెంకటేశ్వర్లు, గజ్వెల్ శంకర్, వీర్ల బుజంగం, నాయకం భాస్కర్, నంగునూరి అశోక్, పొలాస కిరణ్, సోమేశ్ చారీ, రాజు యాదవ్, కోయడ రాజు యాదవ్, కాలేషా, చాకలి జనార్దన్, శ్రీనివాస్, నర్సిములు తదితరులు, అండాలు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.