గణేష్ ఉత్సవాలు సామాజిక, జాతీయ చైతన్యానికి వేదికగా నిలవాలి : ఏనుగు సుదర్శన్ రెడ్డి
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గణేష్ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా సామాజిక ఐక్యత, సాంస్కృతిక పరిరక్షణ, జాతీయ చైతన్యం, ప్రజా భాగస్వామ్యానికి వేదికలుగా నిలవాలని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ మేడ్చల్ ఉమ్మడి మండల కో-కన్వీనర్‌గా నియమితులైన చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్‌ను ఏనుగు సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో లోకమాన్య బాలగంగాధర్...