ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర సర్కిల్ శామీర్‌పేట డివిజన్ దేవరయాంజాల్‌లో ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం గురువారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో తూంకుంటకు చెందిన జగదీశ్‌గౌడ్ రూ.1,35,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.వినాయక విగ్రహాన్ని దాత కట్ట శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అందించగా.. అన్నప్రసాద కార్యక్రమాన్ని దాతలు మోటే బాలయ్య, గంధం ప్రవీణ్ కుటుంబ సభ్యులు నిర్వహించారు. లడ్డూ వేలంపాట అనంతరం అతిథులు దానిని జగదీశ్‌గౌడ్‌కు అందజేశారు కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఇ.శ్రీనివాస్, బీజేపీ నాయకులు పి.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహదాత కట్ట శ్రీకాంత్‌రెడ్డి, అన్నప్రసాద దాతలు మోటే బాలయ్య, గంధం ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాతలను ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు శాలువాలతో సత్కరించారు.అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించి, గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వినాయకుడిని ఊరేగించి నిమజ్జనం చేశారు.