రూ.1.35 లక్షలకు వినాయకుడి లడ్డూ
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసర సర్కిల్ శామీర్‌పేట డివిజన్ దేవరయాంజాల్‌లో ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి 11 రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం గురువారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో తూంకుంటకు చెందిన జగదీశ్‌గౌడ్ రూ.1,35,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.వినాయక విగ్రహాన్ని దాత కట్ట శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అందించగా.. అన్నప్రసాద కార్యక్రమాన్ని దాతలు మోటే బాలయ్య, గంధం ప్రవీణ్ కుటుంబ సభ్యులు నిర్వహించారు. లడ్డూ వేలంపాట అనంతరం అతిథులు...