మెఫెంథెర్మిన్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయ ముఠా అరెస్ట్

🔸రాజేంద్రనగర్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు.. ముగ్గురు అరెస్ట్ ఆర్.జె.న్యూస్,హైదరాబాద్ : మెఫెంథెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఫలక్‌నుమాలోని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 110 మెఫెంథెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వైయల్స్, 25 సిరంజిలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 🔸ఇండియామార్ట్ ద్వారా కొనుగోలు పోలీసుల...