RJNEWS TELUGU
Date of Publish : 08 November 2026, 8:57 pm Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు

🔸జీహెచ్‌ఎంసీ షట్టర్‌లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్.. పేలిన సిలిండర్

🔸సకాలంలో స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది.. తప్పిన ప్రాణనష్టం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ షట్టర్‌లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలినట్లు సమాచారం. దీంతో అక్కడ మంటలు చెలరేగి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.