సూరజ్‌కు స్వర్ణం.. వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్‌లో భారత్‌కు తొలి గోల్డ్.. చరిత్ర సృష్టించిన సూరజ్ కుమార్ చంద్

ఆర్.జె.న్యూస్, స్పోర్ట్స్ : ఎన్ఐఎస్యూ వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత స్క్వాష్ ప్లేయర్ సూరజ్ కుమార్ చంద్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుని స్వర్ణ పతకం సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా సూరజ్ రికార్డు నెలకొల్పాడు. ముంబైలో జరిగిన ఫైనల్లో సూరజ్ హంగేరీకి చెందిన బెనెడెక్ టకాక్స్‌తో తలపడ్డాడు. ఐదు గేములపాటు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సూరజ్ 5-11, 11-8, 11-5, 6-11, 11-4 తేడాతో విజయం సాధించాడు....