కాలుష్యంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి

🔸ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని మేడ్చల్‌ నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి విమర్శ ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో కాలుష్య సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని మేడ్చల్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నగర చెత్తను మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాకు తరలిస్తూ ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు, చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై ప్రజల్లో ఆందోళన...