అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా దసరా వేడుకలు – వాహన పూజలు చేసిన చైర్ పర్సన్ శిరీష

ఆర్ జె న్యూస్, అలియాబాద్: అలియాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో దసరా పండుగ, దుర్గాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మున్సిపాలిటీకి చెందిన అన్ని పారిశుద్ధ్య, అధికారిక వాహనాలకు సాంప్రదాయబద్ధంగా వాహన పూజలు చేశారు. ప్రజలకు, సిబ్బందికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పాల్గొని వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు, శ్రేయస్సు...