RJNEWS TELUGU
Date of Publish : 15 August 2026, 6:48 pm Posted by : RJ NEWS TELUGU

డీమార్ట్‌ గోదాంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆర్ జె న్యూస్ మేడ్చల్ : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ దేవరయాంజల్‌లోని డీమార్ట్‌ గ్రాసరీ గోదాంలోనూ జాతీయ స్ఫూర్తిని చాటుతూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ మేనేజర్‌ రమేష్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండాకు గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగులు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారుకార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ సాయి, ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజర్‌ వెంకటేష్‌, అరవింద్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.