RJNEWS TELUGU
Date of Publish : 25 August 2026, 6:32 pm Posted by : RJ NEWS TELUGU

ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా వనమహోత్సవం

🔸 జీనోమ్‌ వ్యాలీలో మొక్కలు నాటిన వైస్ చైర్‌పర్సన్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వనమహోత్సవం – 2026లో భాగంగా ఆలియాబాద్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మురహరిపల్లి వార్డు పరిధిలోని జీనోమ్‌ వ్యాలీలో మంగళవారం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ కన్‌రెడ్డి మాలతి మాధవరెడ్డితో పాటు కౌన్సిలర్లు, అటవీ శాఖ అధికారులు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు.మెడిసిటీ ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సులు సైతం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చైర్‌పర్సన్‌ మాలతి మాధవరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణంలో పచ్చదనం పెంపొందించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.కమిషనర్‌ ఎన్‌.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పట్టణాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో తీర్చిదిద్దేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు గాదె వెంకటేష్‌, హపావత్‌ వెంకటేష్‌, గురుకుల దీప, యూసుఫ్‌ బాబా, జశ్వంత్‌రెడ్డి, వి.శ్యామ్‌, ఎల్లూ దీపిక, దాసరి రవి, కైరా గణేష్‌, ఏఈ సన షహీన్‌, అటవీ శాఖ సిబ్బంది, మెడిసిటీ వైద్యులు, నర్సులు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.