RJNEWS TELUGU
Date of Publish : 02 September 2026, 3:43 pm Posted by : RJ NEWS TELUGU

పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్సార్

ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా చంద్రపురి కాలనీ, జవహర్ నగర్ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. బాలాజీ నగర్ లోని వైఎస్సార్ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఉచిత కరెంట్, 108, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శాంతి కోటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానంద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి అనంతలక్ష్మి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్ తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.