మారేడుపల్లి మైసమ్మ బోనాల జాతరకు ఘన సన్నాహాలు

ఆర్.జె.న్యూస్, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శతాబ్దాల చరిత్ర గల శ్రీ మైసమ్మ తల్లి బోనాల జాతరను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు చిర్రబోయి వైష్ణవి యాదవ్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె, గత 45 ఏళ్లుగా తమ కుటుంబం తరఫున అమ్మవారికి బోనాలు, ఫలహారం బండ్ల ఊరేగింపును సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. తాతల తండ్రుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని అదే భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నామని వైష్ణవి తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా...