కర్తవ్యనిష్ఠతో సేవలందించిన శ్రీనివాస్‌కు ఘన సన్మానం
ఆర్.జె.న్యూస్, శామీర్‌పేట్ : హకీంపేట్ ఆర్టీసీ డిపోలో సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్)గా కర్తవ్యనిష్ఠతో పనిచేసి, తోటి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరించిన ఎస్ శ్రీనివాస్ సేవలు అభినందనీయమని డిపో సూపరిండెంట్ మురారి రామ్మోహన్‌రావు అన్నారు. సంస్థకు విశిష్ట సేవలందించిన అమరనాథ్, ఏడీసీ, నాగరాజు, డ్రైవర్‌లను కూడా అభినందించారు. సోమవారం పదవీ విరమణ సందర్భంగా శ్రీనివాస్‌తో పాటు పదవి విరమణ పొందుతున్న అమరనాథ్, ఏడీసీ, నాగరాజు, డ్రైవర్ లను డిపో సిబ్బంది, యూనియన్ నాయకులు, సహోద్యోగులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురారి...