RJNEWS TELUGU
Date of Publish : 11 August 2026, 8:49 am Posted by : RJ NEWS TELUGU

గురుస్వామికి గురు పురస్కారం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్: అయ్యప్ప భక్తులుగా తీర్చిదిద్దుతూ నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇంద్రకంటి కృష్ణమూర్తి శర్మ గురుస్వామి గురు పురస్కారానికి ఎంపికయ్యారు. 44 ఏళ్లుగా అయ్యప్పస్వామి దీక్షలో నిస్వార్థంగా, ఉచితంగా సేవలందిస్తున్నందుకు మహాశాస్త్ర సేవా సంఘం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 22న త్యాగరాయ గానసభ వేదికగా నిర్వహించనున్న పురస్కార ప్రదానోత్సవంలో ఆయనకు పురస్కారాన్ని అందజేయనున్నారు. మేడ్చల్‌ ప్రాంతంలో అయ్యప్పస్వామి మాలాధారణకు బీజం వేసి వేలాది మందిని భక్తిమార్గంలో నడిపించిన ఆయన సేవలను పలువురు భక్తులు, స్థానికులు కొనియాడారు.