మేడ్చల్‌లో 270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మేడ్చల్ పోలీసులు, పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. డబిల్‌పూర్ కమ్మాన్ సమీపంలోని జాతీయ రహదారి-44పై శనివారం వాహనాన్ని తనిఖీ చేయగా 540 బస్తాల్లో ఉన్న 270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం బయటపడింది.షామీర్‌పేట్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో పౌరసరఫరాల అధికారులు పంచుల సమక్షంలో డబిల్‌పూర్ కమ్మాన్ వద్ద భారత్ బెంజ్ వాహనం (జీజే-25-యూ-5532)ను అడ్డుకుని తనిఖీ చేశారు. వాహనంలో 540 ప్లాస్టిక్ బస్తాల్లో సుమారు 270...