రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఖరీఫ్‌ 2026–27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు జిల్లా కలెక్టర్‌ (పౌరసరఫరాలు) డి. విజయేందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆయన అధ్యక్షతన ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ ఎల్. సుగుణ బాయి, వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి ఎం.డి. రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని...