RJNEWS TELUGU
Date of Publish : 07 October 2026, 10:39 pm Posted by : RJ NEWS TELUGU

మద్యం మత్తులో ఇంటి నుంచి వెళ్లి.. రైలు కింద పడి ఆత్మహత్య

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్‌కేసర్‌–బీబీనగర్‌ రైల్వే మార్గంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌కు చెందిన పిట్ల వెంకటేష్‌ (53) కూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన వెంకటేష్‌ తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవపడేవాడని తెలిసింది. బుధవారం ఉదయం కూడా మద్యం సేవించిన వెంకటేష్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం బీబీనగర్‌–ఘట్‌కేసర్‌ మధ్య కిలోమీటర్‌ నంబర్‌ 219/7-5 వద్ద అప్‌లైన్‌ రైల్వే పట్టాలపై రైలు కింద పడి మృతిచెందాడు. రైలు డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.