నాలుగేళ్లుగా నెరవేరని హెచ్‌ఎండీఏ హామీలు.. రోడ్డెక్కిన మేడిపల్లి హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ వాసులు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : సొంతింటి కలతో ప్లాట్లు కొనుగోలు చేసి నాలుగేళ్లు గడుస్తున్నా.. లేఅవుట్‌లో కనీస మౌలిక వసతులు అందుబాటులోకి రాకపోవడంతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ ప్లాట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబాలతో కలిసి ఆదివారం రోడ్డెక్కారు. మేడిపల్లి హెచ్‌ఎండీఏ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో లేఅవుట్‌లో సమావేశమై, ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్‌ వరంగల్‌ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలి.....