పేదల సొంతింటి కలే లక్ష్యం – వజ్రేష్ యాదవ్
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా...