టీబీ నియంత్రణకు ఇంటింటి సర్వే

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌: జిల్లాలో క్షయ (టీబీ) వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ‘స్వాస్థ్య నగరం స్టీరింగ్‌ కమిటీ రౌండ్‌టేబుల్‌ సమావేశం’ నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) డా. కె. ఆనంద్‌ పాల్గొని జిల్లాలో చేపడుతున్న ఇంటింటి క్రియాశీల టీబీ కేసుల గుర్తింపు, పరిశోధన పురోగతిపై సమీక్షించారు.పీర్జాదిగూడ, బోడుప్పల్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలోని 72 వార్డుల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధిని నిర్ధారించడమే...