🔸మంత్రులకు టీయూడబ్ల్యూజే కుత్బుల్లాపూర్ కమిటీ వినతి
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కమిటీ కోరింది. ఈ మేరకు కుత్బుల్లాపూర్‌లో గృహ సముదాయ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను సంఘం ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా, కార్యదర్శి మల్లేష్, శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.