బైక్ స్టంట్లతో హల్ చల్ – పట్టుబడ్డ 20 ఏళ్ల యువకుడు – ఖమ్మంలో పోలీసుల నిఘా

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రోడ్లపై ప్రమాదకర బైక్ స్టంట్లతో హల్ చల్ చేస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువతపై ఖమ్మం రూరల్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బైక్ స్టంట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ప్రమాదకరంగా బైక్ విన్యాసాలు చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేశారు. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన ఐతగాని అజయ్ కుమార్ (20) డిగ్రీ మొదటి సంవత్సరం...