ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే గ్రామసభల్లో చెప్పాలి 2002 వివరాలతో ప్రస్తుత జాబితాను సరిచూసుకోవాలి : కలెక్టర్‌ మను చౌదరి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఓటర్లు తమ ఓటరు వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే గ్రామసభల్లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి సూచించారు. గురువారం శామీర్‌పేట్‌ మండలం శామీర్‌పేట్‌ గ్రామంలో నిర్వహించిన సర్వే సంబంధిత గ్రామసభకు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2002 నాటి ఓటరు జాబితాలోని వివరాలను ప్రస్తుతం ఉన్న జాబితాతో సరిచూసుకోవడం జరుగుతోందన్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాల్లో 2002 నాటి వివరాలు లేకపోయినా,...