హెచ్‌సీయూలో కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె. కొత్త కార్మిక చట్టాలతో హక్కులు కాలరాత: నిరసనకారుల ఆవేదన. డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని వెల్లడి
గచ్చిబౌలి, జూన్ 30 : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికులు మరోసారి ఉద్యమబాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని, కార్మిక హక్కులను కాపాడాలని కోరుతూ వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట సోమవారం నుంచి నిరవధిక నిరసనకు దిగారు. కొత్త కార్మిక చట్టాలపై ఆగ్రహం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల తాము తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాల అమలుతో ఉద్యోగ భద్రత కరువైందని, కార్యాలయంలో రక్షణలు బలహీనపడ్డాయని ఆరోపించారు. "దశాబ్దాలుగా పోరాడి...