RJNEWS TELUGU
Date of Publish : 16 August 2026, 7:43 pm Posted by : RJ NEWS TELUGU

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కేశవరం గ్రామానికి చెందిన పులి పెద్దులుకు మంజూరైన నూతన గృహంలో ఆదివారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్‌ బొమ్మలపల్లి నరసింహ, మూడు చింతలపల్లి మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం, కౌన్సిలర్‌ బొమ్మలపల్లి మల్లేశం ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి కుటుంబం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌యాదవ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు యూసుఫ్‌, వెంకటేశం, రాజు, మల్లేష్‌తో పాటు పులి పెద్దులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.