పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కేశవరం గ్రామానికి చెందిన పులి పెద్దులుకు మంజూరైన నూతన గృహంలో ఆదివారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహ, మూడు చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం, కౌన్సిలర్ బొమ్మలపల్లి మల్లేశం ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా...