ఏడాదిలోగా ఇందిరమ్మ టవర్స్‌ పూర్తి

🔸లబ్ధిదారుల చేతికి ఇళ్ల తాళాలు: మంత్రి పొంగులేటి ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిర్మాణాలను నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. నెల రోజుల ముందుగా నిర్మాణం పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలల ముందుగా...