సమాచారం సకాలంలో అందించాలి

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)ను గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఆర్టీఐ వారోత్సవం–2026 అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందించాలన్నారు. స్వచ్ఛందంగా అందించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో పారదర్శకత,...