శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో వినూత్నంగా రాఖీ వేడుకలు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమిని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల, కొంపల్లి-1 సీబీఎస్‌ఈ శాఖ విద్యార్థులు వినూత్నంగా, హృదయాన్ని హత్తుకునేలా నిర్వహించారు. రక్తసంబంధం లేకపోయినా మన జీవితాలను నిస్వార్థంగా కాపాడుతున్న వృక్షాలను అన్నయ్యలుగా భావించి వాటికి రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణకు అరుదైన సందేశాన్ని అందించారు. “వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.. అన్నయ్యలా మనకు అండగా నిలుస్తాయి” అంటూ విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మనకు నీడనిచ్చి, స్వచ్ఛమైన గాలిని అందించి, జీవనానికి ఆధారంగా...