హౌసింగ్‌ బోర్డు కాలనీలో మురుగు కాలువల పరిశీలన

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : మేడ్చల్‌ సర్కిల్‌ పరిధిలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో అంతర్గత మురుగు కాలువలను డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌. సుధాంష్‌ గురువారం పరిశీలించారు. కాలువల్లో మురుగునీటి ప్రవాహం, పారిశుధ్య పరిస్థితులు, పేరుకుపోయిన చెత్త తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను వెంటనే తొలగించి మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, కాలువల శుభ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలనిసూచించారు.కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎం డీఈ విజయలక్ష్మి, సంబంధిత...