భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు వద్దు : సీఐటీయూ. జీఓ 12 రద్దు చేయాలి – డిప్యూటీ ఎంఆర్వోకు వినతి
మేడ్చల్, జూన్ 30: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ నాయకులు సోమవారం డిప్యూటీ ఎంఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, జీఓ నెం.12ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కార్యదర్శి ఎం. నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 22-07-2025న విడుదల చేసిన జీఓ నెం.12 ద్వారా ప్రమాద మరణం, సహజ మరణం, అంగవైకల్యం స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిందని...