RJNEWS TELUGU
Date of Publish : 10 October 2026, 4:27 pm Posted by : RJ NEWS TELUGU

మల్కారం క్వారీలో ఈతకు వెళ్లి ఇంటర్‌ విద్యార్థి మృతి

🔸 స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా ప్రమాదం..

 🔸 నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మల్కారం క్వారీలో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడ సాయిప్రియ కాలనీకి చెందిన ముమ్మారెడ్డి హేమలత కుమారుడు ముమ్మారెడ్డి ప్రణవ్‌ సాయి (17) చేర్యాలలోని గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్టోబర్‌ 9న ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన ప్రణవ్‌ సాయి.. సాయంత్రం స్నేహితులతో కలిసి మల్కారం క్వారీ వద్దకు వెళ్లాడు. అక్కడ వారంతా ఈత కొడుతుండగా ప్రణవ్‌ సాయి నీటిలో మునిగిపోయాడు.సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఈ విషయం తెలుసుకున్న తల్లి హేమలత వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. స్నేహితులను విచారించగా.. వారంతా కలిసి ఈతకు వెళ్లిన సమయంలో ప్రణవ్‌ సాయి నీటిలో మునిగిపోయినట్లు తెలిపారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు నీటిలో గాలించి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.