బొమ్మ తుపాకీతో ఇంట్లోకి చొరబడి బెదిరింపులు..! వ్యాపార వివాదం.. భార్యాభర్తల అరెస్ట్

ఆర్ జె న్యూస్ ,మేడ్చల్ జిల్లా, మేడిపల్లి : వ్యాపార వివాదం కారణంగా అర్ధరాత్రి ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బొమ్మ తుపాకీతో కుటుంబ సభ్యులను బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం బోడుప్పల్‌కు చెందిన చిత్తరంజన్ బిశ్వాస్‌కు ఏడాది క్రితం క్లౌడ్ కిచెన్ వ్యాపారం ద్వారా అనిల్ కుమార్(40), అతని భార్య సుమన్(37)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ నెల 2వ తేదీ...