RJNEWS TELUGU
Date of Publish : 31 October 2026, 8:52 am Posted by : RJ NEWS TELUGU

రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం కిసాన్ నిధులు విడుదల

🔸రాయిలాపూర్ రైతు వేదికలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్

మేడ్చల్ : రైతులకు ఆర్థిక భరోసా కల్పించి, వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు చేయూతనందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం 24వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన సందర్భంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని రాయిలాపూర్ రైతు వేదికలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజరాత్‌లోని బనస్కాంత నుంచి ప్రధాని నిధులను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం, వ్యవసాయ పెట్టుబడులకు కలుగుతున్న ప్రయోజనాలు, రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు కొండం ఆంజనేయులు, రాయిలాపూర్, గిర్మాపూర్ ఉపసర్పంచ్‌లు మెట్టు పెంటారెడ్డి, బొక్క రఘుపతిరెడ్డి, రైతులు సత్తిరెడ్డి, నర్సింహారెడ్డి, ధర్మారెడ్డి, రఘురామ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ అధికారి మాధవరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి నీరజ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.