వైద్యం ముసుగులో మృత్యు వ్యాపారమా

🔸మేడ్చల్‌ ‘స్వరూప నర్సింగ్‌ హోమ్‌’పై సంచలన ఆరోపణలు 🔸బయట ఎంబీబీఎస్‌ వైద్యుల బోర్డులు.. లోపల ఆర్‌ఎంపీలతోనే వైద్యం? 🔸కిటికీకి సెలైన్‌ బాటిల్‌ కట్టి చికిత్స.. కనీస వసతులూ కరవే! 🔸రోగుల ప్రాణాలతో చెలగాటమా? అధికారుల తనిఖీలెక్కడ? ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ :ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యశాలే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్‌ పట్టణంలోని ‘స్వరూప నర్సింగ్‌ హోమ్‌’పై స్థానికులు, రోగుల బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి బయట ప్రముఖ వైద్యుల పేర్లు, ఎంబీబీఎస్‌ బోర్డులు...