చందానగర్‌లో జ్యువెల్లరీ షాప్ చోరీ కేసు ఛేదింపు.. నలుగురు అరెస్ట్
🔸500 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి నిందితుల గుర్తింపు ఆర్ జె న్యూస్, చందానగర్ : చందానగర్‌లోని బాలాజీ జ్యువెల్లర్స్‌లో జరిగిన చోరీ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చందానగర్ క్రైమ్, సీసీఎస్ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 500 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పటికే మరో దొంగతనం...